By Padmavathi Sirangu
గంభీరమైన స్వరం
దృఢమైన సంకల్పం
కఠోరమైన శ్రమ
అలుపెరగని పోరాటం
ఖచ్చితమైన,నిబద్ధతతో కూడిన జీవనశైలి
ఒక పదునైన సరళి
సున్నితమైన మనసు
ఒకే మాట మీద నిలబడి ఉండటం
మంచి అలవాట్లు
సహనం,దయ,సమాజం పట్ల
ఎంతో నమ్మకం,ఎదుటివారికి సహాయం చేసే గుణం,
ఎదుటి వ్యక్తిలో దేవుడిని చూడటం.
ఇవన్నీ వినడానికి చాలా ఆహ్లాదంగా అందంగా చాలా తృప్తిగా ఉన్నాయి, కానీ సమాజంలో ఇవన్నీ అందరూ పాటిస్తున్నారా, ప్రపంచం చాలా దారుణంగా బాధ్యత లేనట్టుగా తోస్తుంది.
మిత్రమా నీకు ఎవరు చెప్పారు, నువ్వు ఎక్కడ చూస్తున్నావు ,ఎక్కడ వింటున్నావు, ఒకవేళ నువ్వు అన్నట్లుగా సమాజం అస్తవ్యస్తంగా ఉంటే?
ప్రతి ఉదయం స్వేచ్ఛగామేలుకో గలవా!
హాయిగా నిద్రించు కలవ మిత్రమా !
దయవుంచి నువ్వు నువ్వు గా తెలుసుకో ,
నువ్వు గా విను చూడు మాట్లాడు ప్రపంచం గురించి ,సమాజం
గురించి.
నిజంగా నువ్వు నడిచే తీరును బట్టి ప్రపంచం మారుతుంది ,సమాజం మారుతుంది ,నువ్వు చేసే ప్రతి పని యొక్క ఫలితం మాత్రమే సమాజంలో ఒక పెద్ద మార్పును తీసుకు వస్తుందని నమ్మి తీరాలి.
మిత్రమా దేనికి అసూయ,
దేనికి భయం,
దేనికి జంకు,
దేనికి అనుమానం ఎదుటి వ్యక్తి మన లాంటి వాడే. బహుశా మన కంటే కొంచెం అధికంగానో, లేక మితంగానో ఉంటాడు తప్పితే మన లాంటి వాడే అని గుర్తు పెట్టుకో.
నువ్వు నువ్వుగా మంచిగా ఉండటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి నువ్వు నువ్వు గా ఉండు
జీవిత సత్యం మరణశయ్య మీద అందరూ మనసులో ఉండేది ఒక్కటే ,నువ్వు భగవంతుడు ఒక్కడే అదే నిజం నిజం.
నువ్వు నడిచే మార్గం నిజం, కల్మషం లేని మనసుతో ఉండు, అందరితో మంచిగా ఉండు, ప్రపంచం మీ సొంతం అవుతుంది.
మనుషులు వేరుగా ఉన్నారా కంగారు పడకు, వాళ్ళు వాళ్ళ మనసులో సరిగ్గా ఉంటారు చివరిక్షణంలో, సమాజం మీద నమ్మకంతో మీ మిత్రుడు.
By Padmavathi Sirangu
Nice Lines