By Tanmaya Yenugu
తాను- నేను
ఏ పరిస్థితి అయ్యిన చిరునవ్వును పెదాల పైకి తెచ్చే నేను…
చిరునవ్వుని పొదుపుగా వాడే తాను…
కళ్ళలో ప్రతి భావం పలికించే నేను…
కళ్ళ వెనుక ఎన్నో భావాలని దాచే తాను…
పారే సెలయేరులా గల గల మాట్లాడే నేను…
మౌనంతో ఎన్నో నిజాలని నిక్షిప్తం చేసే తాను…
పొద్దుటి సూర్యుడిల తెరిచిన పుస్తకం నేను…
నిశీధి చాటున నీగూడ మర్మం తాను…
కనిపించని గాలితో స్నేహం చేసే…
వీచే గాలిని వీసుకొనే తాను…
ప్రకృతిలో సర్వం ఆస్వాదించే నేను…
తనకు నచ్చినట్టు ప్రకృతి ఉండాలి అనే తాను…
ప్రతిక్షణం జీవితంలో ప్రేమని వెతికే నేను…
వెత్తకుండానే ప్రేమ దొరకాలి అనుకునే తాను…
జీవితం అంత రంగులుగా మార్చుకునే నేను…
శూన్యాపు నలుపు కోసం ఆరాటపడే తాను…
ఎంత సంచరిన తన గూటికి చేరాలనే నేను…
అవసరాన్ని బట్టి గూటిని తెరిచే తాను…
నిత్యం ఆనందం అన్వేషించే నేను…
ఆనందపు నిమిషాని కూడా ప్రశ్నించే తాను…
జ్ఞాపకాలని ముఠా కట్టుకునే నేను…
జ్ఞాపకాలని దూరంగా విసిరేసే తాను…
అడమరపు నిద్రలో తియ్యటి స్వప్నం తనే కావాలనే నేను…
నిద్రలోనే హాయిని కలవరపెట్టే తాను…
ఉప్పొంగే అలలా తనలో కలిసిపోవాలి అని నేను…
ధరి చేరిన అలను తిరిగి సముద్రంలోకి నెట్టే తాను…
నా నయనాంతరంగములలో దాచిన రూపం తాను…
మాయ చేసిన కాలం లో నేను పొందుపర్చుకున సత్యం తాను…
రెండు వేరు వేరు ప్రపంచాలు ఎప్పటికీ కలవవు అని నిరూపించిన తాను…
Thanu-Nenu
Whatever the situation may be, I will bring a smile on my lips
He is the one who uses smile sparingly
I am the one who expresses every emotion in the eyes
He hides many feelings behind the eyes
I speak lively like a continuous flowing river
He is the one who hides many truths with silence
I am the open book like brightness of morning sun
He is mysterious like moonlight holds secrets that it hides
I make friends with winds that cannot be seen
He is the one who shuts the wind that blows
I find my bliss in nature’s embrace
He demands nature should be as he likes
I am searching for love in every moment of life’s hue
He is one who wants to get love without searching and clues
I am the one who makes life colourful
He craves for the darkness hidden from the light
No matter how much I wander, I love to rest my soul in his embrace
He opens the doors of embrace as per the need
I am the seeker of happiness everyday
He is a person who questions happy moment of a day
I love to gather lots of lots of memories and store them
He never stores memories and one who throws away the memories
I want him to be my sweet dream in deep sleep
He likes to disturb my peaceful naps
I want to merge into him like a floating ripples
He pushes the wave that reached the way back into the sea
He is the love hidden in my inner eyes
He is the truth that I found in the era of magic
He says that people from two different worlds and two different mentalities are not meant for each other and he won
By Tanmaya Yenugu
Kommentare